»Udayanidhi Stalin Cm Stalin Reacts On Sanatana Dharma Controversy
CM Stalin: సనాతనధర్మం వివాదంపై స్పందించిన సీఎం స్టాలిన్
తమిళనాడు మంత్రి సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఉదయనిధిపై హాట్ కామెంట్స్ చేయగా పలువు ప్రఖులు ఆయనకు మద్దతిచ్చారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ ఈ వివాదంపై స్పందించాడు.
Udayanidhi Stalin, CM Stalin reacts on Sanatana Dharma controversy
CM Stalin: సనాతన ధర్మం(Sanatana Dharma )పై తమిళనాడు మంత్రి, సినీ నటుడు ఉదయనిధి(Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశమంతట కలకలం రేపాయి. డెంగీ, మలేరియా మాదిరి సమాజాన్ని వేధిస్తున్న సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బలంగా స్పందించాలని, డీఎంకే(DMK) పార్టీని విమర్షించాలని ప్రధాని తన సహచరులకు చెప్పినట్లు స్టాలిన్ ఆరోపణలు చేశారు. అలాగే సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన కామెంట్లపై కూడా ఆయన స్పందించారు. ఏ మతాన్ని కానీ, ఏ మత విశ్వాసాలను కించపరచడం ఉదయనిధి ఉద్దేశం కాదని స్టాలిన్ చెప్పారు. ఎస్సీలు, ఎస్టీలు, మహిళలను సనాతన ధర్మం వివక్షకు గురి చేస్తున్నాయని మాత్రమే ఉదయనిధి చెప్పాడని అన్నారు. బలహీన వర్గాలను అణచివేయడంపై ఉదయనిధి మాట్లాడిన మాటలను బీజేపీ మద్దతుదారులు సహించలేకపోయారని, అందుకే ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫయిర్ అయ్యరు. ఉదయనిధి వ్యాఖ్యలపై గట్టిగా స్పందించాలని తన సహచర మంత్రులకు మోదీ చెప్పారంటూ ఆరోపణలు చేశారు. సనాతన ధర్మంలో ఉన్న అసమానతలను రూపుమాపే ధైర్యం బీజేపీకి లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా సామాజిక న్యాయం వర్ధిల్లాలి అనే శీర్షికతో ఉదయనిధి ఓ ప్రకటనను విడుదల చేశారు. తనపై నమోదైన కేసులను చట్టబద్ధంగా ఎదుర్కొంటానన్నారు. అన్నాదురై అన్న మాటలనే తాను చెబుతున్నానన్నారు. డీఎంకే ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదన్నారు. కానీ సనాతన పేరుతో అసలు సమస్యలను బీజేపీ పక్కదారి పట్టిస్తోందన్నారు. తన తల తెస్తే రూ.10 కోట్లు ఇస్తానన్న అయోధ్య స్వామిసహా తనను హెచ్చరించిన వారి గురించి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. తాము డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై వారసులమని, తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని అందరికీ తెలుసునని చెప్పారు. తానూ ఆధ్యాత్మికవాదినేనని చెప్పారు. ఒకవేళ ఏదైనా మతం వర్గాల పేరిట ప్రజలను విభజిస్తే, అంటరానితనం, బానిసత్వాన్ని బోధిస్తే అలాంటి మతాన్ని వ్యతిరేకించే వారిలో ముందు ఉంటానని అన్నాదురై చెప్పారని గుర్తు చేశారు. అందరూ సమానత్వంతో జన్మించారని బోధించే అన్ని మతాలను డీఎంకే గౌరవిస్తుందన్నారు.