TG: సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు చేసింది. 6 హోల్‌సేల్, రిటైల్ షాపులపై దాడులు చేయగా కల్తీ పనీర్, ఖోవా, క్రీమ్, నెయ్యి బయటపడింది. మొత్తం 3,892 కిలోల డెయిరీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం పనీర్‌ను కిలోకు రూ.280కు విక్రయిస్తున్నారని, ఆరుగురిని అరెస్టు చేశారు.