TG: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని.. కొన్ని చోట్ల వడగండ్లు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.