MDK: రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ వెంకు గారి ఉమా సంజీవరెడ్డి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. గ్రామంలోని ప్రయాణ ప్రాంగణం (బస్టాండ్) గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరి, పైకప్పు కృంగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ వెంటనే స్పందించి, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన సొంత ఖర్చులతో బస్టాండ్ మరమ్మతులు చేశారు.