విశాఖ: జిల్లాలోని మెలోడీ థియేటర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సందడి నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల షోను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జనసేన శ్రేణులు, అభిమానులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.