NLR: జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, ఉపాధి పనుల సమయం తగ్గింపుతో పాటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు.