TPT: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో గాత్ర కచేరీ, భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీమతి పి. శైలజ బృందం గాత్ర కచేరీ, శ్రీమతి శైలజ రెడ్డి బృందం భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.