SRCL: రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు బుధవారం వేములవాడ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో SDPO శ్రీనివాసులు, సీఐ వీర ప్రసాద్, ఎస్సై ఎల్ల గౌడ్ పాల్గొన్నారు. అధికారులు రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలని, అపోహలు, వివాదాలు రాకుండా సహకరించుకోవాలని సూచించారు.