హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,930గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. అటు కిలో వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేకుండా రూ.2,55,000 వద్దే నిలకడగా ఉంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.