BDK: అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మమతకు 4.5 కిలోల బరువున్న శిశువుకు శస్త్రచికిత్స లేకుండానే సుఖ ప్రసవం చేశారు. సాధారణంగా ఇంత బరువుంటే సిజేరియన్ చేస్తారు. కానీ డా. మౌనిక, నర్సింగ్ ఆఫీసర్ ప్రమీల రాణి నార్మల్ డెలివరీ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. శనివారం వైద్య సిబ్బంది ప్రశంసిస్తున్నారు.