AP: రాష్ట్ర ప్రజలంటే YCPకి ఎందుకు అంత కోపమని మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న నేతలే నాడు కాంగ్రెస్లో ఉండి రాష్ట్రానికి రాజధాని లేకుండా విభజన చేశారని మండిపడ్డారు. ఇప్పుడు అమరావతినీ వ్యతిరేకిస్తున్నారని ఫైరయ్యారు. CM చంద్రబాబు నాడు రాష్ట్రం విడిపోతే ఇరుప్రాంతాలకూ న్యాయం జరగాలని చివరివరకు పోరాడారే కానీ విభజనకు ఇబ్బందులు సృష్టించలేదని పేర్కొన్నారు.