ADB: టీపీసీసీ ఛీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆదిలాబాద్ చేరుకున్నారు. ఈనెల 6న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆయన వచ్చారు. తొలుత డీసీసీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.