KL Rahul: ఆసియా కప్ 2023లో భారత క్రికెట్ జట్టుకు శుభవార్త వెలువడింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ పూర్తిగా ఫిట్‌గా శ్రీలంక చేరుకున్నాడు. గాయం కారణంగా రాహుల్ టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు అతను టోర్నీలో మిగతా మ్యాచులు ఆడడం కోసం టీమ్ ఇండియాలో నేడు చేరాడు. ఆసియా కప్‌లో రాహుల్ జట్టు ప్రధాన వికెట్ కీపర్. కానీ ఆయన గైర్హాజరీతో ఇషాన్ కిషన్ కు అవకాశం ఇచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక రాహుల్‌కు తదుపరి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పిస్తారా లేదా ఇషాన్ కిషన్‌తోనే జట్టు వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గాయం కారణంగా రాహుల్ చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు.
ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు చేరుకుంది. భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి టోర్నీలో తదుపరి దశకు చేరుకుంది. ఇప్పుడు టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ని సెప్టెంబర్ 10న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ గ్రేట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇస్తారా లేక ఇషాన్ కిషన్‌పై మాత్రమే నమ్మకం ఉంచుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేఎల్ రాహుల్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లు ఆడటం గమనార్హం. తన కెరీర్లో ఇప్పటివరకు 47 టెస్టులు, 54 వన్డేలు, 72 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 7 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2642 పరుగులు చేశాడు. ఇది కాకుండా రాహుల్ 52 వన్డేల్లో 45.13 సగటుతో 1986 పరుగులు చేశాడు. అతను తన బ్యాట్‌తో 5 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను టీ20 అంతర్జాతీయ 68 ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, 22 అర్ధ సెంచరీల సహాయంతో 226 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో రాహుల్ 37.75 సగటుతో .. 139.12 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.