అర్ధచంద్రాసనం అనేది ఒక అద్భుతమైన సమతుల్య యోగాసనం. శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంచుతుంది. కాళ్లు, పిరుదులు, వెన్నుముకను బలపరుస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. నడుము నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మెడ, వెన్నుముక లేదా మోకాలి గాయాలు ఉన్నవారు ఈ ఆసనాన్ని నివారించాలి. తక్కువ లేదా అధిక రక్తపోటు, కళ్లు తిరిగే సమస్య ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.