W.G: తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.