తెలుగు సంవత్సరాల్లో పరాభవ 40వది. ఈ ఏడాది పేరు పరాభవ. మనలోని అరిషడ్వర్గాలను జయిస్తే పరాభవమన్నది ఉండదని ఈ ఉగాది సందేశం. పరాభవ అంటే ఓడిపోవడం, అపజయం అనుకుంటున్నప్పటికీ.. బాహ్యప్రపంచంలో ఓడిపోవడం అనేది కాదు. బయటి శత్రువుల కంటే మనలోని చెడు ఆలోచనలను ఓడించడానికి ఈ ఏడాది సరైనది. అహంకారాన్ని విడనాడి, సత్యం, ధర్మం వైపు సాగేవారికి ఈ సంవత్సరం గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది.