GNTR: చేబ్రోలు మండలంలోని వడ్లమూడిలో బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, శాసనమండలి మాజీ ఛైర్మన్ అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముస్లిం మత పెద్దలతో కలిసి నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.