ఓ వ్యక్తి మద్యానికి బానిసవ్వడంతో తనతో 16 ఏళ్లు కాపురం చేసిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే 15 ఏళ్ల తన ముగ్గురు బిడ్డలను ఆమె తన భర్త వద్దే వదిలి వెళ్లిపోయింది. ఏడాదిగా తన బిడ్డలను పోషించిన ఆయన తన భార్య తిరిగి రాకపోడంతో మద్యం సేవించి తన ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కేరళ (Kerala) రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో నిందితుడు మద్యానికి బానిసగా మారి రోజూ తన భార్యను వేధిస్తుండేవాడు. దీంతో ఆయన భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందని, ఆమె తన ముగ్గురు కుమార్తెలను కూడా భర్త దగ్గరే వదలి వెళ్లిందని పోలీసులు తెలుసుకున్నారు. భార్య దూరం కావడంతో ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. మద్యం మత్తులో ఆగ్రహంతో ఊగిపోయాడు.
ముందుగా ఇంటికి వచ్చి చిన్న కూతురు గొంతును ఆ వ్యక్తి కోశాడని, ఆ తర్వాత తన ఇద్దరు కూతుళ్లను కూడా వెంబడించి మరీ గొంతులు కోశాడని పోలీసులు వెల్లడించారు. ముగ్గురు కూతుర్లను చంపాక తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చిన్న కూతురి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరు కూతుర్లకు ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.