MULG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉగాది సందర్భంగా ముందస్తుగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ప్రిన్సిపల్ నవీన్ అధ్యక్షత వహించారు. విభాగాధిపతి కె. సంపత్ విద్యార్థులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి, పండుగ ప్రాముఖ్యతను వివరించారు.