‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మహేష్ ఆచంట వైపు హీరోయిన్ శ్రీలీల సీరియస్ లుక్స్ SMలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఘటనపై శ్రీలీల వివరణ ఇచ్చింది. తన ఫోన్ మహేష్ దగ్గర ఉందని.. అందుకే తాను వెనక్కి చూసినట్లు అతడు అనుకున్నాడని తెలిపింది. కానీ ఏదో శబ్ధం వచ్చినట్లు అనిపించడంతోనే తాను వెనక్కి చూశానని.. అంతకుమించి ఏదీ లేదని స్పష్టం చేసింది.