MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు సముచిత గౌరవం లభిస్తుందని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ అన్నారు. బుధవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని MBNR కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్లో మైనార్టీలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. కులమతాలకతీతంగా ప్రజలంతా కూడా సంతోషంగా పండగలు జరుపుకోవాలని అన్నారు.