డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ రావడంపై నటి హేమ హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయితే దోషులేనా?.. జైలుకెళ్లినంత మాత్రాన నేరం చేసినట్టేనా? అని ప్రశ్నించారు. తాను సెలబ్రిటీని కాబట్టే అప్పుడు తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను పదే పదే చూపించిన ఛానల్స్.. క్లీన్ చిట్ ఇచ్చిన విషయంపై మాత్రం సపోర్ట్ చేయట్టేదన్నారు.