Tsrtc All Time Record: రాఖీ పండగ రోజున తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (Tsrtc) ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఒక్కరోజు 40 లక్షల పైచిలుకు మంది ప్రయాణీకులను గమ్యస్థానం చేర్చింది. 40.92 లక్షల మంది ట్రావెల్ చేయగా.. ఒక్కరోజే రూ.22.65 కోట్ల ఆదాయం సమకూర్చింది. గత ఏడాది రాఖీ పౌర్ణమి రోజున రూ.21.66 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి రూ. కోటి ఆయం పెరిగింది.
ఒకేరోజు ఈ స్థాయిలో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఆర్టీసీ (Tsrtc) వర్గాలు చెబుతున్నాయి. 20 డిపోల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతానికి పైగా నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరసగా రెండో ఏడాది కూడా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ సారి రాఖీ పౌర్ణమి బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అని పండితులు చెప్పినప్పటికీ.. అంతా గురువారం రోజున ట్రావెల్ (travel) చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులను ఇటీవలే ప్రభుత్వంలో విలీనం చేశారు. దీంతో 40 వేల పైచిలుకు ఉద్యోగులకు మేలు జరగనుంది. ఇప్పటికే వీఆర్ఏల రెగ్యులరైజేషన్.. పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.