KRNL: జిల్లా ప్రజలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన సంవత్సర ఆరంభం కాగా, రంజాన్ సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎల్లప్పుడూ మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుందన్నారు. ప్రజలు పండుగలను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.