KRNL: ఆదోని మండలం పాండవగల్లుకు చెందిన 60 ఏళ్ల ఉపాధి కూలీ చిన్న మారేన్న బుధవారం వడదెబ్బతో మృతి చెందారు. ఉదయం పని చేస్తుండగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్న సమయంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. 7 ఏళ్ల క్రితం భార్య మరణించగా, కూలీ పని చేస్తూనే ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశారు. కుమారుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి.