KRNL: ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్లో దివ్యాంగుల ఉచిత బస్సు పథకాన్ని టీడీపీ యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. ఈ పథకం ద్వారా 11.16 లక్షల మందికి ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సహాయకులకు 50% టికెట్ రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది.