PLD: ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని వినుకొండలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్యాంగులతో కలిసి బస్సులో స్వయంగా ప్రయాణిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.