ATP: అనంతపురంలో దివ్యాంగుల కోసం ‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ఆమె బస్సులో ప్రయాణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పేర్కొన్నారు.