AP: జగన్ CM అయ్యాక వివేకా హత్య కేసులో సునీత ఎంత కోరినా CBI విచారణకు ఒప్పుకోలేదని PCC చీఫ్ షర్మిల తెలిపారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. వివేకా హత్య కేసును ఎందుకు కొలిక్కితేలేకపోయారు? అని ప్రశ్నించారు. మీడియా, సోషల్ మీడియా చేతిలో ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య ముమ్మాటికీ కడప MP టికెట్ విషయంలోనే జరిగిందని పేర్కొన్నారు.