NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం మధ్యాహ్నం అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.