‘ఎల్లమ్మ’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీపై DSP ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్ చెబుతున్న 5 నిమిషాలకే కనెక్ట్ అయిపోయానని తెలిపాడు. తనకు ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు వేణు యెల్దండి, నిర్మాత దిల్ రాజుకు థ్యాంక్స్ చెప్పాడు. గతంలో కూడా చాలామంది యాక్ట్ చేయమని అడిగారని.. కానీ తాను ఎగ్జయిట్ అయ్యే సబ్జెక్ట్ దొరకలేదన్నాడు.