SRCL: తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ల సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ ఉగాది పండుగ విశిష్టత, షడ్రుచుల లాభాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం సర్పంచ్, అధ్యాపకులు, విద్యార్థులతో ఉగాది పచ్చడి సేవించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దుబ్బాక ప్రభాకర్, గ్రామ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.