మలయాళ హీరో జయసూర్య, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కథనార్’. అనుష్క ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీపై నయా అప్డేట్ ఇచ్చారు. 2026, మార్చి 31న మధ్యాహ్నం 1:31 గంటలకు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నాడు.