తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మనోళ్లు. సీత పాత్రలో చూసి.. నిజంగానే సీతలా ఫీల్ అయ్యారు ఆడియెన్స్. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సీతారామం సినిమా క్లాసికల్ హిట్ అవడంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటోంది మృణాల్ ఠాకూర్. ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని సరసన ఛాన్స్ అందుకుంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. విజయ్ దేవరకొండతోను ఓ సినిమా చేస్తోంది. నాగార్జున అప్ కమింగ్ ఫిల్మ్లోను అమ్మడి పేరే వినిపిస్తోంది. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఆర్సీ 16లోను మృణాల్ లైన్లో ఉంది. ప్రస్తుతం మృణాల్ చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పూజా మెరీ జాన్, పిప్పా, ఆంఖ్ మిఖోలి వంటి సినిమాల్లో నటిస్తోంది సీత. ఇలా ప్రస్తుతం యంగ్ హీరోలతో ఛాన్స్ అందుకుంటున్న మృణాల్.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు.
ఆ మధ్య ఓ హిందీ సాంగ్‌లో తన అందాలను మొత్తం బయటపెట్టేసి షాక్ ఇచ్చింది మృణాల్. అప్పటి నుంచి అమ్మడి అందాల విందు చేస్తునే ఉంది. ఇక తాజాగా పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అమ్మడు. ఇటీవలె మృణాల్ నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ వెబ్షో రిలీజ్ అయింది. వివాహ బంధం నేపథ్యంలో రూపొందించిన ఈ షోలో మృణాల్ ఠాకూర్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పెళ్లి గురించి చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.
‘వివాహ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని.. తన స్నేహితుల్లో చాలా మంది పెళ్లి చేసుకొని సంతోషంగా సంసార జీవితాన్ని గడుపుతున్నారని’ చెప్పుకొచ్చింది. కాకపోతే మన ఆలోచనలు, అభిరుచులకు దగ్గరైన వ్యక్తి కోసం ఎదురు చూడాలి.. పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.. ఓపిక పడితే సరైన జీవిత భాగస్వామి దొరుకుతాడు. పెళ్లి గురించి ఏదో ఒక దశలో తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిందేనని.. చెప్పుకొచ్చింది.