మహేష్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై నయా అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన కీలక టాకీ పార్ట్ షూట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య వచ్చే సన్నివేశాలపై చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది.