ASF: దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన భవాని అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు SI విక్రం తెలిపారు. స్వగ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చిన ఆమె, 2 రోజుల క్రితం కాగజ్ నగర్ నుంచి బల్లార్షాకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం తెలిసిన వారు 8712670537ను సంప్రదించాలన్నారు.