JGL: చెగ్యాం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం పద్ధతులు, ప్రయోజనాలను వివరించారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచ్, వ్యవసాయ అధికారి సాయి కిరణ్, అధికారులు పాల్గొన్నారు.