పళ్లు తోముకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గట్టిగా, ఎక్కువ సేపు బ్రష్ చేస్తే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. కేవలం 2 నిమిషాలు, మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌తో సున్నితంగా తోముకోవాలి. నాలుకను శుభ్రం చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) బ్రష్ చేయాలి. ప్రతి 3 నెలలకోసారి బ్రష్ మార్చాలి. వాడిన తర్వాత బ్రష్‌ను శుభ్రంగా ఆరబెట్టాలి.