నిద్రలేవగానే అలారం ఆపి వెంటనే మంచం దిగకండి. కనీసం రెండు నిమిషాలు మంచంపైనే కూర్చోండి. అరచేతులను రుద్దుకుని కళ్లకు అద్దుకోండి. శరీరాన్ని నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి. వెంటనే లేవడం వల్ల రక్తపోటులో మార్పులు వచ్చి కళ్లు తిరిగే ప్రమాదం ఉంది. ఇలా నెమ్మదిగా మేల్కొనడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.