IPL-2026 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ బ్యాటర్ KL రాహుల్ ఈసారి DC తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయమైంది. గత సీజన్లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన రాహుల్‌ను ఈసారి ఓపెనర్‌గా పంపాలని జట్టు యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ సీజన్లో రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా చేపట్టనున్నాడు.