దానిమ్మ పండును ‘పోషకాల గని’ అని పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, కె, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు దీనిని తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి ముఖం మెరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ, చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.