అన్నమయ్య: దివ్యాంగుల సంక్షేమానికి మరో కీలక అడుగుగా దివ్యాంగ శక్తి పథకాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ఉదయం 11:30 గంటలకు RTC బస్టాండ్లో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి, వారి ఆత్మగౌరవం మరియు స్వావలంబనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.