ATP: ఆశా కార్యకర్తలు, ANMలు మాత శిశు సేవలపై శ్రద్ధ వహించాలని DMHO దేవి అన్నారు. అనంతపురం DMHO కార్యాలయంలో మాతృ మరణాలు శిశు మరణాలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన 6 శిశు మరణాలపై ఆమె ఆరా తీశారు. భవిష్యత్తులో జిల్లాలో ఎలాంటి మాత శిశు మరణములు జరగకుండా చూడాలన్నారు. గర్భవతులు, బాలింతలకు ప్రభుత్వ సేవలు చేరవేయాలన్నారు.