PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో నిర్మించిన 30 పడకల సామాజిక ఆసుపత్రి పనులను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఇవాళ పరిశీలించారు. పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో ఆసుపత్రిని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.