JGL: విద్యార్థులకు అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం నమూనా ఐక్యరాజ్యసమితి కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. విద్యార్థులకు పలు విషయాలపై ఆమె అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్, DEO రాము, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.