Agriculture Success Story: కేవలం 8 గుంటల భూమిలో కూరగాయల పంట.. నెలకు రూ.1.50 లక్షల సంపాదన
Agriculture Success Story: ఉద్యోగం నుంచి రిటైరయ్యాక విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు చాలామంది. వచ్చే పింఛను డబ్బులతో జీవితాన్ని హాయిగా సరదాగా గడపాలని వారు ఆలోచిస్తుంటారు. అయితే బీహార్లో ఓ ఆర్మీ జవాను రిటైర్మెంట్ తర్వాత అద్భుతం చేశాడు. గ్రామానికి వచ్చి కూరగాయల సాగు ప్రారంభించాడు.
Agriculture Success Story: ఉద్యోగం నుంచి రిటైరయ్యాక విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు చాలామంది. వచ్చే పింఛను డబ్బులతో జీవితాన్ని హాయిగా సరదాగా గడపాలని వారు ఆలోచిస్తుంటారు. అయితే బీహార్లో ఓ ఆర్మీ జవాను రిటైర్మెంట్ తర్వాత అద్భుతం చేశాడు. గ్రామానికి వచ్చి కూరగాయల సాగు ప్రారంభించాడు. దీంతో గతంలో కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఏడాదిలో కూరగాయలు అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. రిటైర్డ్ సైనికుడు తూర్పు చంపారన్ జిల్లా పిప్రా కోఠి బ్లాక్లో ఉన్న పూర్వ పంచాయతీ నివాసి. అతని పేరు రాజేష్ కుమార్. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోకుండా వ్యవసాయం చేయడానికే మొగ్గు చూపారు. వ్యవసాయం ప్రారంభించగానే ఊరి జనం ఎగతాళి చేశారు. కానీ రాజేష్ వాటిని పట్టించుకోకుండా తన పనిని కొనసాగించాడు. కానీ దానివల్ల ప్రయోజనం రావడం ప్రారంభించినప్పుడు అందరూ మాట్లాడటం మానేశారు.
విశేషమేమిటంటే తొలుత రాజేష్ కుమార్ బొప్పాయి సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించాడు. మొదటి సంవత్సరంలోనే బొప్పాయి అమ్మి రూ.12.5 లక్షలు సంపాదించాడు. ఆ తర్వాత అందరి నోళ్లు మూతపడ్డాయి. వచ్చిన లాభంతో ఉత్సాహంగా మరుసటి సంవత్సరం నుంచి అరటి, కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టాడు. ఈసారి 8 గుంటల భూమిలో గుమ్మడి కాయల సాగుకు శ్రీకారం చుట్టాడు. రోజూ 300 గుమ్మడి కాయలు విక్రయిస్తూ 4 నుంచి 5 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఇలా నెలకు దాదాపు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నాడు. విశేషమేమిటంటే రాజేష్ కుమార్ తన ఉత్పత్తిని విక్రయించడానికి మార్కెట్కు వెళ్లాల్సిన అవసరం లేదు. పొలం నుంచి వచ్చిన తర్వాతే వ్యాపారులు కూరగాయలు కొంటారు. గోపాల్గంజ్, సివాన్, సీతామర్హి, శివహర్ల నుండి వ్యాపారులు రాజేష్ కుమార్ నుండి కూరగాయలు కొనడానికి అతని గ్రామానికి వస్తారు. 8 గుంటల పొలంలో గుమ్మడి సాగుకు రూ.10 నుంచి 20 వేల వరకు ఖర్చు చేసినట్లు రైతు రాజేష్ కుమార్ తెలిపారు. ఈ విధంగా ఖర్చులు మినహాయిస్తే ఈ నెలలో రూ.1.30 లక్షల లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు.