ఆసిఫాబాద్ మండలం సాలెగూడకి చెందిన బామనే రాకేష్ (24) అనే యువకుడు మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 16న రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన రాకేష్, మంగళవారం ఇంటి సమీపంలోని చెట్టు వద్ద మృతదేహంగా కనిపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.