NGKL: హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 15న నిర్వహించిన మూడవ రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఏ. నిరంజనమ్మ విశేష ప్రతిభ కనబరిచారు. 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆలేరు ఉప కేంద్రంలో పనిచేస్తున్న ఆమెను జిల్లా కలెక్టర్ మంగళవారం ఘనంగా సన్మానించారు.