తెలంగాణ(Telangana)లో మద్యం టెండర్ల ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య లక్ష దాటినట్లు తెలుస్తుంది. అయితే, ఎక్సైజ్ అధికారుల (Excise officials) అంచనాకు మించి దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మద్యం టెండర్ (Tender) దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, వరంగల్, మహబూబ్ నగర్లో భారీగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే అబ్కారీ శాఖ(Abkari branch)కు రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఇవాళ రాత్రి 12 లేదా రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి లెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,03,489 దరఖాస్తులు రాగా.. గత ఏడాది 79 వేల దరఖాస్తులు వచ్చాయి.. గత ఏడాదితో పోలిస్తే 40 శాతం దరఖాస్తులు ఈ సంవత్సరం పెరిగాయి. ఇంకా ఆదాయం(income)పెరిగే అవకాశం ఉండటంతో మద్యం టెండర్ ప్రక్రియతో అబ్కారీ శాఖకు కాసుల పంట పండింది. ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అదే రోజు లైసెన్సులు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి.గతంలో కంటే రెండింతలు పోటీ పెరిగింది. షాపులు దక్కించుకునేందుకు సిండికేట్ (Syndicate) గా వ్యాపారులు పోటిపడ్డారు.. ఓ వ్యాపారి తన భాగస్వాములతో కలిసి 999 దరఖాస్తులు దాఖలు చేసినట్లు సమాచారం. ఈరోజు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి.