AP: గ్యాస్ కొరత లేకున్నా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘నార్మల్ రోజుల్లో కంటే బుకింగ్స్ పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దు, ప్రతిరోజూ 2,80,000 బుకింగ్స్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే బాధ్యత మాది’ అని పేర్కొన్నారు.